News June 17, 2024
వనపర్తి: కల్యాణ గడియల్లో జిల్లాకు బాస్‌గా..

జిల్లాకు వచ్చే సివిల్ సర్వీసెస్ అధికారులు కల్యాణ గడియల్లో వస్తున్నారనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. 2023 జనవరి 26న ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రక్షిత కె.మూర్తి నెలరోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 1న జిల్లాకు కలెక్టర్ హోదాలో వచ్చిన తేజస్ నందలాల్ పవార్ నెలరోజుల్లోనే వివాహం చేసుకోగా.. తాజాగా వచ్చిన కలెక్టర్ ఆదర్శ్ సురభి మ్యారేజ్ సైతం జలై 7న జరగనుంది.
Similar News
News April 13, 2026
జడ్చర్ల: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

జడ్చర్ల పట్టణంలోని TGMRSJC G1 జడ్చర్ల విద్యార్థినులు ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కల్పనా తెలిపారు. వారి వివరాలు..
1st MPC- షాజ్మీన్ నికత్-468/470
1st BPC- బి.మౌనిక-438/440
2nd MPC- పి.మౌనిక-983/1000
2nd BPC- నజూబ్ బేగం-990/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థులను సన్మానించారు.
News April 13, 2026
MBNR: ఉక్కపోతతో.. అల్లాడుతున్న జిల్లా వాసులు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 41.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్ పేట 41.3, దేవరకద్ర 41.2, మహమ్మదాబాద్ 41.1, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 41.0, అడ్డాకుల 40.8, కోయిలకొండ మండలం పారుపల్లి, సిరి వెంకటపూర్ 40.5, నవాబుపేట, మహబూబ్ నగర్ అర్బన్ 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. MBNRకు 17th Rank

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MBNR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 8,116 మంది పరీక్షలు రాయగా 5,896 మంది పాసై 72.65%తో స్టేట్‌లో 17వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,740 మందికి 1,432మంది పాసై 82.30%తో 6వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,049 మందికి 364 మంది పాసై 34.70%తో 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 110 మందికి 54 మంది పాసై 49.09%తో 21వ ప్లేస్ వచ్చింది.


