News March 26, 2025
వనపర్తి: కూరగాయలు, పండ్లు పాడవుతున్నాయా? ఇలా చేయండి..

✓ కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు. ✓ ఫ్రిజ్ టెంపరేచర్ 4°C లేదా అంతకంటే తక్కువే ఉంచాలి. ✓ ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి. ✓ అరటి, ఆపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్‌ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేరువేరుగా ఉంచాలి. ✓ త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.
Similar News
News March 29, 2025
అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
News March 29, 2025
మండుతున్న ఎండలు.. 150 మండలాల్లో 40+ డిగ్రీలు

AP: రాష్ట్రంలో వడగాలులు, ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ 150కిపైగా మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5, రుద్రవరం, అనకాపల్లిలో 42, కోసిగి, తాడిమర్రిలో 41 డిగ్రీలు రికార్డయినట్లు పేర్కొంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.
News March 29, 2025
యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.