News October 22, 2025

వనపర్తి: కేతపల్లిలో అత్యధిక వర్షపాతం

image

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో వర్షం నమోదైంది. అత్యధికంగా కేతపల్లిలో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీరంగాపూర్ 20.8 మి.మీ, పెబ్బేరు 20.0 మి.మీ, పానగల్ 17.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇతర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

Similar News

News October 22, 2025

అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్‌ పార్కు రద్దు చేస్తాం: బొత్స

image

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్‌ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.

News October 22, 2025

కృష్ణా: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

image

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.

News October 22, 2025

GNT: సముద్ర స్నానాలు.. జాగ్రత్త వహించండి.!

image

కార్తీక మాసం సందర్భంగా సముద్ర, నది స్థానాల్లో స్నానం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. మన ఉమ్మడి జిల్లా వారు. సూర్యలంక బీచ్, చీరాల బీచ్, కృష్ణ నది ప్రాంతాలలో పోలీస్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కావున సముద్ర, నది స్నానాలకు వెళ్లేవారు లోతులను గమనించటంతో పాటు పిల్లలపై శ్రద్ధ వహించి క్షేమంగా ఉండాలని Way2news ఆశిస్తుంది.