News October 19, 2025
వనపర్తి: కొత్త మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంపు

కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడగించినట్లు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం బ్యాంకులు పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురుగా వ్యాపారుల వినతులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లక్కీ డ్రా ఈనెల 27న కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనునట్లు వెల్లడించారు.
Similar News
News October 21, 2025
వారితో అప్రమత్తంగా ఉండండి: ఏసీపీ దామోదర్

విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ప్రజలకు ముఖ్య సూచన చేశారు. పని మనుషులు, కేర్ టేకర్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరారు. ఇటీవల కన్సల్టెన్సీల ద్వారా వచ్చే సిబ్బంది నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అనుమానాలు ఉంటే తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.
News October 21, 2025
బ్రేకప్‌పై రష్మిక ఏమన్నారంటే?

రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
News October 21, 2025
దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్‌స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.