News March 7, 2025
వనపర్తి: క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పది: ఎస్పీ

క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరు క్రీడలను ఆడుతూ మానసిక, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ వనపర్తి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ కీ.శే నారమ్మ నర్సిరెడ్డి, బాదం పాండురంగయ్య స్మారకార్థం పురుషుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
Similar News
News February 25, 2026
మేడ్చల్: సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయని 2,099 స్టూడెంట్స్

ఇంటర్ పరీక్షలలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొదటిరోజు ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 70,268 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 68,169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 2,099 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.
News February 25, 2026
తిరుపతి: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 25, 2026
వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

అమెరికా ఆంక్షలు ఎత్తేశాక వెనిజులా నుంచి ఇండియాకు ముడిచమురు దిగుమతులు మొదలయ్యాయి. ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను మోసుకెళ్లే సూపర్ సైజ్ ట్యాంకర్లు భారత తీరం వైపు కదులుతున్నాయని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఈ వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ల (VLCC) వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు వేగంగా డెలివరీలు జరుగుతాయని చెప్పింది. నిస్సోస్ కియా, నిస్సోస్ కైథ్నోస్, అర్జానా ట్యాంకర్లు రానున్నట్లు పేర్కొంది.


