News October 6, 2025
వనపర్తి: ‘గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం’

గ్రంధాలయాలు దేవాలయాలతో సమానమని వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పుస్తక పాఠకులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కనీస అవసరాలను తీర్చకపోయినా, గృహంలో స్థానం కల్పించకపోయినా తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 ప్రకారం శిక్షార్హులన్నారు.
Similar News
News October 6, 2025
HYD: విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది: కోమటిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఎర్రమంజిల్‌లో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని స్థానిక MLA దానం నాగేందర్, MLC రియాజుల్ హాసన్, జిల్లా కలెక్టర్ హరిచందనతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
News October 6, 2025
మీ కోపాన్ని చాటింగ్‌లో చూపిస్తున్నారా?

రిలేషన్షిప్‌లో గొడవలు కామన్. కానీ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసే వాదనలు ప్రమాదకరమని అక్రాన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. చాటింగ్ ద్వారా జరిగే గొడవలు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ సేపు జరుగుతాయని తేలింది. అలాగే ఇవి 4 రెట్లు ఎక్కువ చిరాకు తెప్పిస్తాయట. చిన్న విభేదాలు పెద్దవిగా మారి స్నేహాలు, సంబంధాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయట. అందుకే మాట్లాడి సర్దిచెప్పుకోవడం బెటర్.
News October 6, 2025
GWL: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి: SP

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 12 అర్జీలు వచ్చాయన్నారు. భూ వివాదాలకు సంబంధించి 6, గొడవకు సంబంధించి 1, కొడుకులు పట్టించుకోవడంలేదని 1, ప్లాట్ భూకబ్జాకు సంబంధించి 2, అప్పు తీసుకొని ఇవ్వడం లేదని 1, ఇతర అంశాలకు సంబంధించి 1, మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయన్నారు.