News March 12, 2025
వనపర్తి: చర్యలకు ఉపక్రమించిన మున్సిపల్ సిబ్బంది

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కచ్చా లేఅవుట్ లలో ఉన్న సరిహద్దు రాళ్ళు, ప్లాట్ల రాళ్ళను మంగళవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినప్పటికీ సంబంధిత లే అవుట్ యజమానులు, ప్లాట్ల యజమానులు డబ్బులు కట్టకుండా సరైన స్పందన లేకపోవడంతో మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
Similar News
News December 18, 2025
ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News December 18, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరదేశి పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 18, 2025
ADB: UPSCలో సత్తా చాటిన జిల్లా యువకుడు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు నోముల సాయి కిరణ్ 82వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ-గంగన్నల కుమారుడు సాయి కిరణ్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) సాధించాడు. పలువురు సాయి కిరణ్‌కు అభినందిస్తున్నారు.


