News February 8, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 26, 2026

ముసునూరు: అత్యాచార కేసులో మూడేళ్ల జైలు శిక్ష

image

ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన దోమతోటి సుధాకర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మచిలీపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2018లో ఓ దివ్యాంగ మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు ఈ శిక్ష ఖరారు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించారు.

News February 26, 2026

10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్స్ మార్క్‌ని దాటిన తొలి వరల్డ్ లీడర్‌గా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం.

News February 26, 2026

‘ఏ తల్లి కన్న బిడ్డో.. ఇంకా జాడ లేదు’

image

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిన ఘటనలో ఆ బిడ్డ ఎవరనే విషయం 24 గంటలైనా తేలలేదు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి మదర్ మిల్క్ న్యూట్రీషన్ సెంటర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఉన్నతాధికారులు ఎవరూ అక్కడికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవు. ICDS, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది.