News April 9, 2025

వనపర్తి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన మదనాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అజ్జకొల్లుకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బాలకృష్ణ అనారోగ్యం కారణంగా ఏడాది నుంచి పనికి వెళ్లట్లేదు. దీంతో తల్లి లక్ష్మి ఆ పనికి వెళ్లేది. ఆ జీతం యువకుడి అకౌంట్లో పడేవి. తల్లి డబ్బులడగగా ఇవ్వకపోవటంతో అతడిపై గొడ్డలితో దాడి చేసింది. గాయపడిని యువకుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Similar News

News April 17, 2025

534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు

image

AP: మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విన్నపంతో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సహకరించిన కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News April 17, 2025

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించిన ఎంపీ 

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబ‌ర్ ద్వారా అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌ని విశాఖ ఎంపీ శ్రీ‌భ‌ర‌త్, క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్ర‌జ‌లకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవ‌చ్చన్నారు. 

News April 17, 2025

తెలుగులోకి మలయాళ సూపర్ హిట్ చిత్రం!

image

మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘అలప్పుజ జింఖానా’ తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!