News February 13, 2025

వనపర్తి: జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News January 7, 2026

ములకలచెరువు మద్యం కేసు.. కస్టడీకి నిందితులు

image

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న నకిరేకంటి రవి(A16), శ్రీనివాస్ రెడ్డి(A23)ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా వీరిద్దరూ ఉన్నారు. 2రోజుల కస్టడీకి తీసుకోగా.. మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వీరిని విచారిస్తారని సమాచారం.

News January 7, 2026

10 ఏళ్ల పిల్లాడికి హార్ట్ ఎటాక్.. రీల్స్ చూస్తుండగా..

image

హార్ట్ ఎటాక్‌తో పెద్దలే కాదు యువకులు, పిల్లలు <<18554317>>చనిపోతున్న<<>> ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా UPలోని అమ్రోహ(D)లో 4వ తరగతి చిన్నారి మరణించాడు. మయాంక్(10) రీల్స్ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారని, హార్ట్ ఎటాక్‌కు కారణమేంటో గుర్తించలేకపోయామని చెప్పారు.

News January 7, 2026

గద్వాల: ఖరీఫ్ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి

image

రైతుల నుంచి 2025- 26 ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ధాన్యం డబ్బులు చెల్లింపు, సీఎంఆర్ సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024- 25కు సంబంధించిన సీఎంఆర్‌ను ఫిబ్రవరి 28 వరకు పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఎస్ఓ పాల్గొన్నారు.