News February 12, 2025

వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

Similar News

News February 13, 2025

వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

image

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.

News February 13, 2025

LBనగర్‌: ఆస్పత్రిలో మైనర్ బాలుడు మృతి.. ఆందోళన

image

మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్‌లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడు మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!