News October 28, 2025

వనపర్తి జిల్లాలో అక్కడే అధిక వర్షపాతం

image

వనపర్తి జిల్లాలో 21 వర్షపాత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వెలుగొండలో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దగడలో 8.5, జానంపేట 4.5, శ్రీరంగపురం 3.0, ఏదుల 2.8, పెబ్బేరు 2.5, రేమద్దుల, కేతేపల్లి, గోపాల్‌పేట, రేవల్లిలో 1.8, సోలిపూర్, పానగల్ 1.5, పెద్దమందడి 1.3, కానాయిపల్లి 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News October 28, 2025

HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

image

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT

News October 28, 2025

నిర్మల్: రేపటి నుంచి సోయా కొనుగోలు ప్రారంభం

image

నిర్మల్ మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం (రేపటి) నుంచి సోయా కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతుల పంటను త్వరగా కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు రైతులు సహకరించాలని కోరారు.

News October 28, 2025

‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

image

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.