News April 10, 2025

వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. అత్యధికంగా కానాయిపల్లిలో 39.2 డిగ్రీలుగా నమోదైంది. మదనాపూర్, ఆత్మకూరు, రేమొద్దులలో 39.1, గోపాల్‌పేట్ 38.9, పెబ్బేరు 38.8, విల్లియంకొండ, దగడా, సోలిపూర్, రేవల్లి, అమరచింతలో 38.7, కేతేపల్లి 38.4, శ్రీరంగాపూర్ 38.1, వనపర్తి 37.9, ఘనపూర్, పెద్దమందడి 37.7 పానగల్ 37.6, జానంపేట 37.5, వెలుగొండ 37.0, వీపనగండ్ల 36.0 డిగ్రీలుగా నమోదయ్యాయి.

Similar News

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.

News September 17, 2025

ప్రజాపాలన దినోత్సవం.. ఎస్పీ జెండా ఆవిష్కరణ

image

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో SP మహేష్ బీ గితే ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి పోరాట ఫలితంగానే మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామని కొనియాడారు. వేములవాడ ASP శేషాద్రి రెడ్డి, అదనపు SP చంద్రయ్య, CIలు, RIలు, SIలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News September 17, 2025

కలెక్టర్‌కు కీర్తి చేకూరికి ఉద్యమ నోటీసులిచ్చిన సచివాలయ ఉద్యోగులు

image

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందస్తు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయలో ఐక్యవేదిక నాయకులు కలిసి ఈ వినతిని ఇచ్చారు. దడాల జగ్గారావు, కాశీ విశ్వనాథ్, రామాంజనేయులు, నాయుడు, కొల్లి రాజేష్, రామదాసు తదితరులు ఉన్నారు.