News November 30, 2025
వనపర్తి జిల్లాలో ఎన్నికల వివరాలు..!

వనపర్తి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
తొలి దశ – 5 మండలాల్లోని 87 గ్రామాలు, 780 వార్డుల్లో
రెండో దశ – 5 మండలాల్లోని 94 గ్రామాలు, 850 వార్డుల్లో
మూడో దశ – 5 మండలాల్లోని 87 గ్రామాలు, 806 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News April 13, 2026
పరిశ్రమల స్థాపనకు ‘వరంగల్’ సిద్ధం!

HNK, జనగామ, వరంగల్ సెజ్‌లలో 16.82 లక్షల చ.మీ. విస్తీర్ణంలో 632 ప్లాట్లు సిద్ధంగా ఉన్నట్లు TGIIC వెల్లడించింది. చదరపు మీటరు ధరను రూ.1,325 నుంచి రూ.4,215 వరకు నిర్ణయించారు. అత్యధికంగా వరంగల్‌లో 11.25 లక్షల చ.మీ. స్థలం అందుబాటులో ఉండగా.. ఇక్కడ స్క్వేర్ మీటర్ ధర రూ. 1325 నుంచి రూ.2016గా ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే వీలుంది.
News April 13, 2026
అనకాపల్లి: నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ తేజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30- 1:30 గంటల వరకు నం.8688400499కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అనకాపల్లి, విశాఖ,అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 13, 2026
పెరిగిన క్రూడాయిల్ ధరలు!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 8.36% ఎగసి 103 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద కొనసాగుతున్నాయి. యురోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓ దశలో 18% పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు <<19635574>>నిలిపేస్తామని<<>> US హెచ్చరించడంతో క్రూడ్ ధరలు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.


