News December 14, 2025
వనపర్తి జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే!

అమరచింత మండల పరిధిలోని అమరచింత ఆర్ఆర్ సెంటర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు విజయభారతి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చిన్న మునిప్పపై ఆమె 90 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను, 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Similar News
News April 5, 2026
నీటి సంరక్షణ.. రేపటి నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్

AP: నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 100 రోజుల(ఏప్రిల్ 6-జులై 14) కార్యాచరణను ప్రకటించారు. రేపు అనంతపురం(D) యాడికిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. నీటిని నిల్వ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని CM అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News April 5, 2026
సామాన్య భక్తుడే ముఖ్యం: ఈవో శీనా నాయక్

ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తుల సంతృప్తే తమ ప్రధాన లక్ష్యమని దుర్గమ్మ ఆలయ ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు. సిబ్బంది భక్తులతో మర్యాదగా, చిరునవ్వుతో వ్యవహరించాలని సూచించారు. అన్నదానం, పూజా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, చట్ట నిబంధనలకు లోబడి పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
News April 5, 2026
హనుమకొండ: కాలువలో గల్లంతైన బీటెక్ స్టూడెంట్

కేయూ ఇంజినీరింగ్ కళాశాల వెనుక వైపు ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో ఈతకు వెళ్లిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి భూక్య వాసు గల్లంతయ్యాడు. డోర్నకల్‌కు చెందిన వాసు తన స్నేహితులతో కలిసి కాలువలోకి దిగి, ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.


