News January 2, 2026

వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

image

వనపర్తి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జోగులాంబ గద్వాల జోన్‌-7 డీఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్‌పేట ఎస్సైగా జగన్మోహన్‌, వనపర్తి రూరల్‌కు హృషీకేశ్‌, పెద్దమందడికి జలంధర్‌రెడ్డి బదిలీ అయ్యారు. నరేష్‌ కుమార్‌, శివకుమార్‌లను ఎస్పీ కార్యాలయానికి వీఆర్‌గా పంపారు. బదిలీ అయిన అధికారులు త్వరలోనే తమ బాధ్యతలు స్వీకరించనున్నట్లు జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Similar News

News February 12, 2026

HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

image

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.

News February 12, 2026

నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

News February 12, 2026

అమెరికాలో అమరరాజా కంపెనీ ఏర్పాటు..?

image

బ్యాటరీ రంగంలో దూసుకెళ్తున్న అమరరాజా మరో అడుగు ముందుకు వేసింది. ‘అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ యూఎస్ ఇంక్’ పేరుతో అక్కడ సంస్థ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే ఐదారు నెలల్లోనే ఈ సంస్థ ఏర్పాటు కానుండగా.. దాదాపు 50లక్షల డాలర్లు(రూ.45కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు మూడో త్రైమాసికంలో అమరరాజా రూ.140 కోట్ల లాభాలు పొందింది.