News December 14, 2025

వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @11AM

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.

Similar News

News December 14, 2025

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

image

భారత బౌలర్ల విజృంభణతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 117 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో మార్క్రమ్ (61) మినహా ఇంకెవరూ ప్రభావం చూపలేదు. ఫెరీరా 20, ఆన్రిచ్ నోర్జే 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్, అర్ష్‌దీప్, కుల్దీప్ తలో 2 వికెట్లు, హార్దిక్, దూబే చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 118.

News December 14, 2025

విశాఖ: ఆర్టీసీలో నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు

image

ఆర్టీసీలో నెలరోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 20 నుంచి జనవరి 19వ తేదీ వరకు 48 గంటల్లోనే కస్టమర్లకు పార్సెల్ డెలివరీ చేస్తామన్నారు. విశాఖలో 84 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తక్కువ రేట్లకే కస్టమర్ వద్దకు పార్సెల్స్ చేరుతాయని, ఆర్టీసీకి అదనంగా ఆదాయం చేకూర్చే విధంగా సిబ్బందితో కార్గోపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News December 14, 2025

అప్పుడు తప్పు అని.. ఇప్పుడవే అప్పులా: బుగ్గన

image

AP: ఏపీబీసీఎల్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లను గతంలో విమర్శించిన CBN ఇప్పుడు వాటినే ఎలా జారీ చేస్తున్నారని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ‘18 నెలల్లో ₹2.66 లక్షల CR అప్పు చేశారు. ఉద్యోగులకు జీతాలూ సరిగా ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పంతా ఏమౌతోంది?’ అని నిలదీశారు. లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్‌కు లింకు చేస్తున్నారని మండిపడ్డారు.