News November 27, 2025
వనపర్తి జిల్లాలో మొదటి రోజు 75 నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు నేడు మొత్తం 75 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఘణపురం మండలంలో 28 నామినేషన్లు.
✓ గోపాల్ పేట మండలంలో 13 నామినేషన్లు.
✓ పెద్దమందడి మండలంలో 16 నామినేషన్లు.
✓ రేవల్లి మండలంలో 12 నామినేషన్లు.
✓ ఏదుల మండలంలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News November 28, 2025
‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.
News November 28, 2025
HYD: 75 డెలివరీ గోదాములపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

హైదరాబాద్‌లో ఈ- కామర్స్ ఫుడ్ వేర్‌హౌస్‌లపై ఆహార భద్రత విభాగం భారీగా తనిఖీలు నిర్వహించింది. ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల గిడ్డంగుల్లో కాలపరిమితి ముగిసిన ఉత్పత్తులు, తప్పుదోవ పట్టించే లేబుళ్లు, పాడైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 75 వేర్‌హౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలతో తనిఖీలు నిర్వహించారు.
News November 28, 2025
జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారిగా జైపాల్ రెడ్డి

జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారిగా ముస్కు జైపాల్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాతా శిశు సంరక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి పదోన్నతి పొంది జిల్లా ఉప వైద్యాధికారిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, డిపిఓ రవీందర్ పాల్గొన్నారు.


