News June 12, 2024

వనపర్తి: జిల్లాలో విత్తనాల కొరత లేదు: మంత్రి జూపల్లి

image

వనపర్తి జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువులు, విత్తనాల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News February 6, 2026

MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

image

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.

News February 5, 2026

పాలమూరు: నేటి ముఖ్య వార్తలు

image

✒PU.. డిగ్రీ ఫలితాలు విడుదల
✒MBNR: మున్సిపల్ ఎన్నికల పీసీసీ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
✒పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి
✒PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి
✒పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ
✒మెట్టుగడ్డ మార్కెట్‌పై కాంగ్రెస్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒మున్సిపల్ ఎన్నికలు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం

News February 5, 2026

MBNR:PU.. ఫలితాలు విడుదల UPDATE!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనములో యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ డిగ్రీ 1వ సెమిస్టర్(30.08%), 3వ సెమిస్టర్ (39.72%), 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.