News April 16, 2025
వనపర్తి జిల్లాలో 19,500 మందికి డయాబెటిస్: కలెక్టర్

వనపర్తి జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి 3,09,643 మందికి మిషన్ మధుమేహలో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ పరీక్షల్లో 19,500 మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామని, వారిలో 3,000 మంది కొత్తగా డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారని గుర్తించామని చెప్పారు. డయాబెటిస్ గుర్తించిన వారందరికీ మందులతో పాటు, జీవనశైలిలో మార్పులను సూచించామని పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
కృష్ణ: గోల్డ్ మెడల్ సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్

కృష్ణ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఎం నవీద్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సమావేశంలో డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్నైపర్ డాగ్స్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ రవి ట్రాకింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వీరిని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అభినందించారు.
News July 4, 2025
KCR లేటెస్ట్ ఫొటోలు

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.
News July 4, 2025
ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.