News March 31, 2025

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా దగడ, వెలుగొండలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు 40.4, రేమోద్దుల 40.3, ఆత్మకూరు 40.1, పానగల్ 39.7, శ్రీరంగాపూర్ 39.7, కానాయిపల్లి 39.6, జానంపేట 39.6, విలియంకొండ 39.5, వీపనగండ్ల 39.5, సోలిపూర్ 39.1, గోపాల్‌పేట 39.1, అమరచింత 39.1, మదనాపూర్ 38.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News July 6, 2025

MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

image

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.

News July 6, 2025

మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

image

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.

News July 6, 2025

విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

image

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.