News January 14, 2026

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్, ఎస్పీ శుభాకాంక్షలు

image

మకర సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లాలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

Similar News

News February 14, 2026

శివరాత్రి: రేపు ఉపవాసం ఎవరు ఉండాలి?

image

మనస్సును అదుపులో ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే ఆరోగ్యవంతులైన భక్తులందరూ శివరాత్రి నాడు ఉపవాసం ఉండవచ్చు. మోక్షం కోరేవారు, పాప ప్రక్షాళన కావాలనుకునేవారు, శివకృపకై పరితపించేవారు రేపు ఉపవాసం ఉండాలని పండితుల సూచన. ‘రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. మనోబలం పెరిగి ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి’ అంటున్నారు.

News February 14, 2026

సూర్యాపేట: వార్డు కౌన్సిలర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు

image

నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఓ అరుదైన విజయం నమోదైంది. గతంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసిన ఇంజమూరి వెంకటమ్మ, నేడు అదే మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆమె, తన సమీప ప్రత్యర్థిపై 10 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. శ్రమనే నమ్ముకున్న ఆమెను ప్రజలు ఆదరించడం విశేషం. ఈ అద్భుత విజయం పట్ల పలువురు ఆమెపై ప్రశంసలు కురిపించారు.

News February 14, 2026

అనంతపురం: ఆర్‌డీటీ నిధుల పునరుద్ధరణకు ఎంపీ అంబికా విజ్ఞప్తి

image

అనంతపురం RDTకి FCRA రిజిస్ట్రేషన్‌ను త్వరగా పునరుద్ధరించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖను కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఇతర ఎంపీలతో కలిసి హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కు వినతిపత్రం అందజేశారు. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఈ భేటీ జరిగినట్లు ఎంపీ తెలిపారు. 1969 నుంచి లక్షలాది కుటుంబాలకు ఆర్‌డీటీ అందిస్తున్న వైద్య, విద్యా, సంక్షేమ సేవలను ఆయన వివరించారు.