News April 8, 2025

వనపర్తి జిల్లా బిడ్డకు GOVT జాబ్.. సన్మానం 

image

వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన పోలీస్ వెంకట్ స్వామి కుమారుడు మండ్ల పవన్ కుమార్ ఇటీవల వెలువడిన గ్రూప్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి అడిషనల్ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ప్రముఖ వైద్యుడు పీజే బాబు ఆధ్వర్యంలో కొత్తకోటకు చెందిన సన్రైజర్స్ వాకింగ్ క్లబ్ సభ్యులు పవన్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. రాములు యాదవ్, వెంకటయ్య, శ్రీనివాసులు, సురేశ్, భాస్కర్, వినోద్ సాగర్, కిషోర్ పాల్గొన్నారు.

Similar News

News October 31, 2025

RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com

News October 31, 2025

కాసిపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి: కలెక్టర్

image

కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని సూచించారు.

News October 31, 2025

17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 17న ధ్వజారోహణం, చిన్నశేష, 18న పెద్దశేష, హంస, 19న ముత్యపుపందిరి, సింహ, 20న కల్పవృక్షం, హనుమంత, 21న పల్లకీ, గజ, 22న సర్వభూపాల, స్వర్ణరథం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 23న సూర్యప్రభ, చంద్రప్రభ, 24న రథోత్సవం, అశ్వవాహనం, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణం.