News April 3, 2025
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు “30 పోలీస్ ఆక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
Similar News
News April 4, 2025
రైల్వే స్టేషన్‌లో వ్యర్థాలకు నిప్పు.. వందే భారత్‌కు తప్పిన ముప్పు

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో పొగ కమ్ముకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో అటువైపు వందే భారత్ రైలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై కొంతసేపు రైలును ఆపేశారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదంతప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
రామచంద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రామచంద్రపురం బైపాస్ రోడ్‌లో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి చెందిన వీరి సాయి వెంకటకృష్ణ (20) మృతి చెందాడు. దాసరి శ్రీనుతో కలిసి బైక్‌పై కాకినాడ నుంచి స్వగ్రామం గంటి పెదపూడి వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటకృష్ణ అక్కడికక్కడే చనిపోగా దాసరి శ్రీను గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.