News April 11, 2025
వనపర్తి జిల్లా RAIN UPDATES

వనపర్తి జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. గోపాల్‌పేట్ 9.8 మి.మీ, శ్రీరంగాపురం 9.5 మి.మీ, రేవల్లి 9.3 మి.మీ, వనపర్తి 4.5, జానంపేట 3.3, కేతేపల్లి 3.0, పానగల్ 2.5, రేమద్దుల 2.0, పెబ్బేరు 1.8, సోలీపూర్ 1.3, మదనాపూర్ 1.0, వీపనగండ్ల 0.5, పెద్దమందడి, ఘనపూర్, ఆత్మకూరు, అమరచింత, కానాయిపల్లి, అమరచింత, అఙ్గమకూర్, దగడా 0.00 మి.మీగా నమోదయ్యాయి.
Similar News
News March 27, 2026
అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.
News March 27, 2026
బ్రేక్‌ఫాస్ట్ మెనూ రెడీ: 6 రోజులు.. 5 రకాలు

TG: ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థుల కోసం ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూను అధికారులు రెడీ చేశారు. దీని కోసం ప్రభుత్వం ₹720 కోట్లు కేటాయించింది. ఈ మెనూ ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు.. మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు.
News March 27, 2026
పాలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆనంద్‌రావు

పాలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆనంద్‌రావు ఘన విజయం సాధించారు. గురువారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ఉమాపతి మహేశ్వరిపై 181 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలు ఎన్నికల అధికారి న్యాయవాది కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, మొత్తం 454 ఓట్లు పోలయ్యాయి. అందులో ఆనంద్‌రావుకు 317 ఓట్లు లభించగా.. ప్రత్యర్థికి 136 ఓట్లు వచ్చాయి. ధన్యవాదాలు తెలిపారు.


