News November 28, 2025
వనపర్తి: జీపీ ఎన్నికల ఖర్చులు తప్పక చూపాలి: శ్రీనివాసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలను తప్పనిసరిగా సమర్పించాలని వనపర్తి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా, ఖర్చు వివరాలను 45 రోజుల్లో అందజేయాలన్నారు. లేనిపక్షంలో గెలిచిన అభ్యర్థిని అనర్హుడిగా, ఓడిన అభ్యర్థిని బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు.
Similar News
News December 5, 2025
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.
News December 5, 2025
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు తెలియజేసారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ప్రధానమంత్రి సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్యఆరోగ్య సేవలు, ధాన్యం సేకరణ, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.


