News July 9, 2025

వనపర్తి: జులై 27న లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్ష

image

జులై 27న నిర్వహించబోయే లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. జులై 15లోపు పరీక్ష కేంద్రం వివరాలు సిద్ధంచేసి సీసీఏఎల్ఏకు పంపాలన్నారు. జిల్లాలో మొదటి దశ లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు 112 మందిని కేటాయించామని, ఈనెల 27న వీరికి ఉదయం10 నుంచి మధ్యాహ్నం 1 వరకు థియరీ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2 నుంచి 5వరకు ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News July 10, 2025

మంచిర్యాల జిల్లా అధికారులతో DPO సమావేశం

image

జిల్లా పంచాయతీ అధికారి D.వెంకటేశ్వరరావు అధ్యక్షతన డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్లాంటేషన్, గ్రామపంచాయతీల తనిఖీలు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, DSR గురించి సమీక్షించారు.

News July 10, 2025

కల్తీ కల్లు ఘటనలో బాధితుల వివరాలు

image

బాలానగర్ ఎక్సైజ్ PS పరిధిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌తో పాటు రాందేవ్‌రావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను విడుదల చేశారు. నిమ్స్‌లో 27 మంది చికిత్స పొందుతుండగా కూకట్‌పల్లిలోని రాందేవ్‌దేవ్‌రావు ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

News July 10, 2025

జగిత్యాల జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

image

జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చీటీ శ్రీనివాసరావు విజయం సాధించారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో తన సమీప అభ్యర్థి బండ స్వామిపై 73 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ రావు విజయం సాధించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా సంపూర్ణ చారి, ట్రెజరర్‌గా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు.