News February 5, 2025

వనపర్తి: టాక్స్ వసూళ్లు వేగవంతం చేయండి: కలెక్టర్

image

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ వసూళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్‌తో కలిసి వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు వేగవంతం చేయాలని పన్నులు కట్టని వారికి తక్షణం నోటీసులు జారీ చేయాలన్నారు.

Similar News

News January 9, 2026

విశాఖ: డాక్టర్ సుధాకర్ కుమారుడికి ప్రమోషన్

image

గతంలో విశాఖలో ప్రభుత్వ డాక్టర్‌గా పని చేసిన సుధాకర్ కుమారుడు లలిత ప్రసాద్‌కు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆయనకు డిప్యూటీ తహశీల్దారుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సుధాకర్ కుటుంబం నర్సీపట్నంలో ఉండేది. కరోనా సమయంలో మాస్కుల విషయంలో సుధాకర్ ప్రశ్నించగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారు.

News January 9, 2026

చరిత్ర సృష్టించిన రుతురాజ్

image

లిస్టు-A క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(58.83) నమోదుచేసిన ఆటగాడిగా నిలిచారు. ఇతను 99 మ్యాచ్‌లలో 5,060 రన్స్ చేశారు. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెవాన్(57.86), హెయిన్(57.76), కోహ్లీ(57.67) ఉన్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ(59) మ్యాచుల్లో 15 శతకాలు బాదిన ప్లేయర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కారు.

News January 9, 2026

పాలమూరు: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 8న జిల్లా కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు tsstudycircle.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.