News February 25, 2026
వనపర్తి: ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం అలుముకుంది. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం ఓ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. బుధవారం హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వర్సిటీ అధికారులు వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
Similar News
News March 2, 2026
మహిళా దినోత్సవం వేళ క్రీడా పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న జిల్లాలో మహిళలకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ వెంకట నర్సయ్య తెలిపారు. సోమవారం జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పోటీలను 13 ఏళ్లలోపు, 18 ఏళ్లలోపు మరియు 18 ఏళ్లు పైబడిన వారికి మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల మహిళలు, యువతులు నేరుగా స్టేడియంకు వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు.
News March 2, 2026
BJP దూకుడుకు మాజీ మావోలతో చెక్!

TG: హిందూ అజెండాతో వెళ్తున్న BJPకి మాజీ మావోయిస్టులతో చెక్ పెట్టాలని INC భావిస్తోంది. ఇటీవల వారితో CM భేటీ అవ్వడం ఇందులో భాగమేనని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాలతో పాటు అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల సానుభూతి ఉంటుందని, వారిని ప్రోత్సహిస్తే INCకి కలసి వస్తుందని CM భావిస్తున్నారు. దీనిపై అగ్రనేత రాహుల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో మాజీ మావోయిస్టు నేతలను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.
News March 2, 2026
ADB: PVTGల గుర్తింపు ప్రమాణాలు ఇలా.!

ఆదివాసీ తెగలలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలను గుర్తించేందుకు కేంద్రం 4, 5 ప్రణాళికలో PVTG అనే ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 18 రాష్ట్రాలు, అండమాన్–నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 75 PVTGలు ఉన్నాయి. ధేబర్ కమిషన్ సూచించిన ప్రమాణాలను బట్టి ఆయా వర్గాల సాంకేతిక స్థాయి, తగ్గుతున్న లేదా స్థిరమైన జనాభా, తక్కువ అక్షరాస్యత, జీవనాధార స్థాయి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా PVTGలను నిర్ణయిస్తారు.


