News April 7, 2025

వనపర్తి: తమకు పెళ్లి చేయాలంటూ PSకు ప్రేమ జంట

image

తమకు పెళ్లి చేయాలంటూ ఓ ప్రేమ జంట PSకు వచ్చిన ఘటన వనపర్తి జిల్లా పానగల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రేమద్దుల గ్రామానికి చెందిన నందిని(22), మహేందర్(29) రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయి PSలో ఫిర్యాదు చేసింది. ఇద్దరు మేజర్లు కావడంతో కుటుంబీకులతో పోలీసులు మాట్లాడి ఒప్పించారు. త్వరలో వారి పెళ్లి చేస్తామన్నారు.

Similar News

News March 3, 2026

రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

image

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.

News March 3, 2026

SRCL: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులను 3 రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహిళా సంఘ భవనాలను పూర్తి చేయాలని, తుది దశలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News March 3, 2026

ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.