News April 8, 2025
వనపర్తి: తహశీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీపై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తహశీల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
Similar News
News April 8, 2025
ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.
News April 8, 2025
కొండగట్టులో నాసిరకం ప్రసాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పులిహోర, అన్న ప్రసాదంలో నాసిరకం సరకులు వినియోగిస్తున్నారని కొండగట్టు మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోచమ్మల ప్రవీణ్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రానున్న హనుమాన్ జయంతికి లక్షలాదిమంది వస్తుండగా వారికి నాసిరకం వస్తువులతో తయారు చేసిన పులిహోర, లడ్డు, అన్నప్రసాదం అందజేస్తే ఆలయ ప్రతిష్ఠ దిగజారే అవకాశం ఉందన్నారు.
News April 8, 2025
కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.