News December 19, 2025
వనపర్తి: తాగునీటికి ఓకే.. సాగుకు లేదు

జూరాల ఎడమ కాలువ కింద పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాలకు చెందిన రైతులకు 2025-26 రబీ సీజన్‌కు సాగునీటి సరఫరా ఉండదని డివిజన్-3 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భావన భాస్కర్ తహసీల్దార్లకు సర్క్యులర్ జారీ చేశారు. రానున్న రబీ సీజన్‌లో ఎడమ కాల్వ కింద సాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి నిల్వల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
Similar News
News December 20, 2025
సిద్దిపేట: స్కాలర్షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జెర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజీలాండ్ దేశాలలోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారు అర్హులన్నారు. www.telanganaepass.cgg.gov.inలో 01-19-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 20, 2025
నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్‌గా..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్‌ను గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.
News December 20, 2025
ఈ నెల 24న కొడంగల్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.


