News March 27, 2025

వనపర్తి: తాటి ముంజలతో ఉపయోగాలు!

image

✓ వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. ✓ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ✓ శరీరంలో వ్యర్థాలను తొలగిస్తాయి. ✓ లివర్ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ✓ జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ✓ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ✓ విపరీతమైన చెమట పట్టినప్పుడు, శరీరం నీటిని కోల్పోయినప్పుడు, తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి తిరిగి నీరు లభిస్తుంది. ✓ అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

Similar News

News November 9, 2025

రూ.8వేల కోట్లతో మన్ననూరు- శ్రీశైలం కారిడార్

image

నల్లమల్ల అటవీ ప్రాంతం మండల పరిధిలోని మన్ననూరు నుంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు రూ.8 వేల కోట్లతో కారిడార్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నివేదికను రూపొందించింది. 52 కిలోమీటర్ల మీద నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ రోడ్ పనులు తుది దశకు చేరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దీంతో రిజర్వ్ ఫారెస్ట్‌లో పకృతి వనంలో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని ప్రయాణికులు భావిస్తున్నారు.

News November 9, 2025

పర్వతగిరి: Way2News కథనానికి స్పందన

image

Way2News కథనానికి స్పందన లభించింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకంలో భాగంగా పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో నిర్మించిన మూడు వేల మెట్రిక్ టన్నుల గోదామును వినియోగించాలని కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. పథకంలో భాగంగా నిర్మించిన గోదాములు నిరుపయోగంగా ఉంటున్నాయని గతంలో Way2News ప్రచురించిన కథనానికి స్పందిస్తూ.. ప్రస్తుత అవసరాలకు గోదామును వినియోగించాలని కలెక్టర్ సూచించారు.

News November 9, 2025

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.