News February 17, 2026
వనపర్తి: తొలి ఓసి మహిళా ఛైర్మన్ మాధవి రికార్డ్

వనపర్తి మున్సిపాలిటీకి ఈరోజు తొలి ఓసి మహిళా ఛైర్మన్‌గా ఎన్నికై వనపర్తి చరిత్రలో మిరిదొడ్డి మాధవి రికార్డ్ సృష్టించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి కౌన్సిలర్‌గా విజయం సాధించడమే గాక ఛైర్మన్‌గా ఎన్నికై జాక్పాట్ కొట్టారు. గతంలో రిటైర్డ్ టీచర్ ప్రమీలమ్మ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక కాగాఆమె బీసీ మహిళ కావడం విశేషం. ఆమెకు రాజకీయ నేపథ్యం ఉందని, రాజకీయాలకు కొత్తయిన మాధవి పాలన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.
Similar News
News February 17, 2026
సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్

AP: సభకు హాజరుకాని MLAలను రికాల్ చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ‘8 దేశాల్లో ఈ విధానం ఉంది. కొందరు MLAలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. విధులకు రాకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నాం. అలాగే వీరి శాలరీ ఎందుకు కట్ చేయకూడదు’ అని ప్రశ్నించారు. సభలో MLAల కన్నా మాక్ అసెంబ్లీలో విద్యార్థులే బాగా మాట్లాడారని తెలిపారు. ఇక డిజిటల్ అటెండెన్స్ పనితీరు బాగుందన్నారు.
News February 17, 2026
మ.1.30 గం. వరకే స్కూళ్లు

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
News February 17, 2026
TDR బ్యాంక్@2026.. కాగితం ముక్క ఇక కరెన్సీ నోటుతో సమానం!

మూసీ బాధితులకు ఇచ్చే TDR బాండ్ల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ బాండ్లను బాధితులు బిల్డర్లకు అమ్ముకోవాల్సి వచ్చేది. అక్కడ వాళ్లు మోసపోయే అవకాశం ఉండేది. దీనికి చెక్ పెడుతూ సర్కారే ఒక ‘డిజిటల్ TDR ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయబోతోంది. ఇది పారదర్శకతను పెంచుతుందని చెప్తున్నా మార్కెట్ రేటును ప్రభుత్వం నియంత్రించడం వల్ల బాధితులకు ఆశించిన ధర దక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.


