News November 17, 2025

వనపర్తి: ధాన్యం ఆన్‌లైన్ ఎంట్రీలో ఆలస్యం.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇందులో 10,682 MT ధాన్యాన్ని మిల్లులకు తరలించినా, 6 వేల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆన్‌లైన్ ఎంట్రీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.