News November 12, 2025

వనపర్తి: నవంబర్ 14 నుంచి ‘మిషన్ మధుమేహ-దృష్టి’

image

డయాబెటిస్ రోగులు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభంలోనే సమస్యలను గుర్తిస్తే నివారించవచ్చని వనపర్తి ఇన్‌చార్జి DMHO సాయినాథ్ రెడ్డి అన్నారు. NOV 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని డయాబెటిస్ రోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ‘మిషన్ మధుమేహ-దృష్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను మంగళవారం DMHO కార్యాలయంలో నిర్వహించారు.

Similar News

News November 12, 2025

ఎస్ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

2002లో నమోదైన ఓటర్ల జాబితాను ప్రస్తుతం(2025) ఉన్న ఓటర్లతో పాటు వారి సంతానంలో ఉన్న ఓటర్లను ఎస్ఐఆర్‌లో సరిపోల్చడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు/ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రానున్న రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సమావేశం నిర్వహించారు.

News November 12, 2025

ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

image

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్‌ 30 పోలీసు చట్టంను నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News November 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.