News December 3, 2025

వనపర్తి: నిన్న ఒక్కరోజే 442 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీలకు నిన్న ఒక్కరోజే 442 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఆత్మకూరు – 68 నామినేషన్లు.
✓ అమరచింత – 54 నామినేషన్లు.
✓ కొత్తకోట – 102 నామినేషన్లు.
✓ మదనాపురం – 82 నామినేషన్లు.
✓ వనపర్తి – 136 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు 741 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

Similar News

News December 3, 2025

జనగామ: ఏకగ్రీవం అయిన చోట రేపు ఎన్నికలు: కలెక్టర్

image

జనగామ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డ్ మెంబర్ గ్రామాల్లో రేపు ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లో సంబంధిత ఎంపీడీవోలు ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు వారు అన్నారు.

News December 3, 2025

బల్దియా.. బడా హోగయా!

image

ORR సమీపంలోని 20 పట్టణాలు, 7 నగరాలు GHMCలో విలీనమయ్యాయి. DEC 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీంతో విస్తీర్ణం, జనసాంద్రత, పరిపాలనా విభాగాల పరంగా GHMC దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, నగరాల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్‌లు, జోనల్ కమిషనర్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

News December 3, 2025

IND vs SA.. రెండో వన్డేలో నమోదైన రికార్డులు

image

☛ వన్డేల్లో ఇది మూడో అత్యధిక ఛేజింగ్ స్కోర్ (359)
☛ వన్డేల్లో కోహ్లీ వరుసగా 2 మ్యాచుల్లో సెంచరీ చేయడం ఇది 11వ సారి
☛ SAపై అత్యధిక సెంచరీలు (7) చేసిన ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
☛ 77 బంతుల్లో రుతురాజ్ సెంచరీ.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఇండియా బ్యాటర్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. Y పఠాన్ (68బాల్స్) తొలి స్థానంలో ఉన్నారు.
☛ సచిన్ 34 వేర్వేరు వేదికల్లో ODI సెంచరీలు చేశారు. దానిని కోహ్లీ సమం చేశారు.