News December 6, 2025
వనపర్తి: నిబంధనలకు లోబడి పని చేయాలి: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించి ప్రజలు, రైతులు, విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు. శనివారం ఈడీఎం వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 72 మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 6, 2025
NTR: Way2News ఎఫెక్ట్.. త్వరలో డయాలసిస్ సెంటర్..!

ఏ.కొండూరులో 830 మందికి పైగా కిడ్నీ బాధితులు ఉండగా, 4 డయాలసిస్ బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై Way2News <<18484118>>కథనాలు<<>> ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ త్వరలో 12 బెడ్లతో కొత్త డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జనవరి 1న కిడ్నీ ప్రభావిత గ్రామాలకు <<18457085>>కృష్ణా జలాలు<<>> అందిస్తామన్నారు. బాధితులకు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణ, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు.
News December 6, 2025
విశాఖ జైలంతా గంజాయి ఖైదీలే..!

విశాఖ కేంద్ర కారాగారం ఖైదీలతో నిండుతోంది. ఇక్కడ సామర్థ్యం 914 మంది కాగా, ప్రస్తుతం 1,724 మంది ఖైదీలున్నారు. వీరిలో గంజాయి కేసులో శిక్ష పడినవారు, విచారణ ఖైదీలు 1,100 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలు ఉండటంతో పర్యవేక్షణ, వసతుల కల్పన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి విశాఖలోని గంజాయి కేసులను ఒకే న్యాయమూర్తి విచారిస్తుండటంతో ఖైదీల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది.
News December 6, 2025
రకాలను బట్టి గ్రేడ్లు నిర్ణయించాలి: ITDA PO

కాఫీ పండ్ల నాణ్యతను బట్టి స్పష్టమైన గ్రేడ్లను నిర్ణయించాలని సంబంధిత అధికారులను పాడేరు ITDA PO తిరుమణి శ్రీ పూజ ఆదేశించారు. శనివారం చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను ఆమె అకస్మికంగా సందర్శించారు. పరిశీలనలో భాగంగా కాఫీ పండ్లు, పార్చ్‌మెంట్‌తో పాటు డ్రాయింగ్ యార్డ్స్‌ను ఆమె పరిశీలించారు. పండ్ల గ్రేడ్‌కు అనుగుణంగా పార్చ్మెంట్, డ్రాయింగ్ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.


