News January 3, 2026

వనపర్తి: ‘నిబంధనలు పాటిస్తేనే భద్రత’

image

18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని వనపర్తి డీటీఓ మానస సూచించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు త్వరలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు డీటీఓ కార్యాలయం నుంచి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం సాగించాలని కోరారు.

Similar News

News February 14, 2026

మున్సి’పోల్స్’లో కాంగ్రెస్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే?

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విజయం కార్యకర్తలు, తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రజాకర్షక విధానాలు, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధికి నిదర్శనం అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

News February 14, 2026

282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in

News February 14, 2026

చిత్తూరు జిల్లా నేతలతో లోకేశ్ సమావేశం

image

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.