News November 7, 2025

వనపర్తి నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

image

అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు వనపర్తి నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15న సాయంత్రం బయలుదేరి, 16న కాణిపాకం, వేలూరు దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుంది. పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ఛార్జీ ఉంటుందని, యాత్ర 18న ముగుస్తుందని ఆయన వివరించారు.

Similar News

News November 8, 2025

త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.

News November 8, 2025

నేడు ములుగు జిల్లాలో కరెంట్ కట్

image

మరమ్మతుల్లో భాగంగా శనివారం ఉ.10 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కరెంట్ ఉండదని డీఈ నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రామచంద్రపూర్, కాటాపూర్, వెంకటాపూర్, వెల్తుర్లపల్లి, మల్లూరు, కమలాపూర్, రాజుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, ధర్మారం, నూగూరు, వెంకటాపురం సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.

News November 8, 2025

గ్రేవ్ క్రైమ్ కేసుల్లో ముద్దాయిల కదలికలపై ప్రత్యేక నిఘా ఉండాలి: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గ్రేవ్, పెండింగ్ కేసుల ఇన్వెస్టిగేషన్ అధికారులతో ఎస్పీ సునీల్ షెరాన్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌, మర్డర్, గ్రేవ్ క్రైమ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు‌. నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో కేసుల్లో ఛార్జిషీట్ త్వరగా దాఖలు చేసి, ముద్దాయిలకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.