News April 3, 2025

వనపర్తి: నేరుగా దరఖాస్తులు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో అర్హులైన వారి నుంచి రాజీవ్ యువ వికాసం పథకానికి నేరుగా కూడా దరఖాస్తులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఈ పథకానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అర్హులైన వారు నేరుగా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలన్నారు.

Similar News

News September 15, 2025

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 15, 2025

రామగుండంలో పొలిటికల్ వార్.. BRS Vs CON

image

రామగుండం నియోజకవర్గంలో 4 రోజుల నుంచి పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, BRS పార్టీ నాయకుల మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం నడుస్తోంది. పేద, మధ్యతరగతి వ్యాపారులను కూల్చివేతల పేరుతో నడిరోడ్డున పడేస్తున్నారని BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

News September 15, 2025

బీ.ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీ.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(Y18 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహిస్తామని, పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 16లోపు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 18లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.