News April 10, 2025
వనపర్తి: పన్నుల సేకరణలో సిబ్బంది పనితీరు భేష్: కలెక్టర్

పన్నుల సేకరణలో వనపర్తి పురపాలిక సిబ్బంది పనితీరు భేష్ అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. 2023-24 లో రూ.4.43కోట్లు ఆస్తి పన్ను వసూలు కాగా, 2024-25 లో రూ.5.55కోట్లు వసూళ్లు కాబడినవని నిర్దేశించిన లక్ష్యంలో 50.78 శాతం లక్ష్యాన్ని సాధించగలిగారని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచడంలో శ్రమించిన సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ.వందల కోట్ల ఖర్చు!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు ఇస్తున్నాయని టాక్. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. అందులో కనీసం 3 లక్షల మందికి రూ.2500 చొప్పున పంపిణీ చేసినా రూ.75Cr ఖర్చవుతుంది. ఇక ప్రచారానికి జన సమీకరణ, యాడ్స్‌కు అదనం. దీంతో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రేపు పోలింగ్ జరగనుంది.
News November 10, 2025
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకల కట్టడి ముఖ్యం. లేకుంటే ఇవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.
News November 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 62

ఈరోజు ప్రశ్న: భీష్ముడు చనిపోవడానికి కారణమైన శిఖండి ఎవరు? ఆమె ఎందుకు అతని పతనాన్ని కోరుకుంది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


