News January 7, 2026
వనపర్తి, పెబ్బేర్ మున్సిపాలిటీలకు రూ.3.73 కోట్లు

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.3.73 కోట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంజూరు చేయించారని స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నిధులతోవీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలను నిర్మిస్తారని వారు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 14, 2026
ఎప్‌స్టీన్‌ను గొంతు నులిమి చంపారా?

US లైంగిక నేరస్థుడు <<19094591>>ఎప్‌స్టీన్<<>>ను గొంతు నులిమి చంపి ఉండొచ్చని ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ డా.మైకేల్ బాడెన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఉరేసుకుని చనిపోయారన్న ప్రకటనపై అనుమానం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్ మెడలో 3 ఫ్రాక్చర్స్ ఉన్నాయని, ఉరివేసుకున్న కేసులో ఇలా జరగడం తానెప్పుడూ చూడలేదన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ పోస్టుమార్టం సమయంలో ఆయన ఫ్యామిలీ తరఫున బాడెన్ అబ్జార్వర్‌గా ఉన్నారు.
News February 14, 2026
NGKL: రోడ్డు ప్రమాదంలో చనిపోయింది వీరే..!

శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తూ.. <<19137612>>రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన<<>> NGKL(D) ఉర్కొండ మండలం తిమ్మనపల్లి వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ (D) తులుకుట్టి మండలం కలికిరికి చెందిన రామ్ రెడ్డి (50), మేఘ (45), మహాదేవి (65) మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 14, 2026
విశాఖ: కోస్టల్ కారిడార్‌లో మార్పులు

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.


