News September 20, 2025

వనపర్తి: పోలీసు శాఖలో హోంగార్డ్స్ అంతర్భాగం: ఎస్పీ

image

హోంగార్డ్స్ పోలీసు శాఖలో అంతర్భాగమని, పోలీసులతో పాటు వారు నిరంతరం సేవలందిస్తున్నారని ఎస్పీ గిరిధర్ అన్నారు. వర్షాకాలంలో, చలికాలంలో విధుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హోంగార్డ్స్‌కు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు అందజేశారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సేవలను ఆయన కొనియాడారు.

Similar News

News September 20, 2025

ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చ: జేసీ

image

జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ నవ్య శనివారం తెలిపారు. సోమవారం నుంచి రూ.1,200 మద్దతు ధర అమలులో ఉండదని, రైతులు కళ్లాల్లో కానీ, లోకల్ ట్రేడర్స్ దగ్గర కానీ, ఇతర మార్కెట్లలో కానీ తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని అన్నారు.

News September 20, 2025

HYD: స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి: మాజీ మంత్రి

image

తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎక్స్‌పో కార్యక్రమంలో BRS సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి అనంతరం మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో యువత స్కిల్స్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.