News October 6, 2025

వనపర్తి: ‘పోస్టర్ల ముద్రణలో నిబంధనలు పాటించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. జిల్లాలోని యజమానులతో ఆయన సమావేశమయ్యారు. ప్రచార సామగ్రిలో ఎక్కడా కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News October 6, 2025

మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

image

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

News October 6, 2025

NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

image

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.

News October 6, 2025

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

image

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.