News November 20, 2025

వనపర్తి: ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి- డీజీపీ

image

ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు,పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

దివ్యాంగులకు శుభవార్త.. కొత్తగా లక్ష పింఛన్లు!

image

TG: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్‌డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను, 2వేల స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

News April 14, 2026

విజయవాడలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

image

గవర్నర్‌పేటలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి DGP హరీష్ కుమార్ గుప్తా హాజరై వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించారు. అగ్నిమాపక యంత్రాలు, పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ప్రమాదాల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించే సిబ్బంది సేవలను కొనియాడారు.

News April 14, 2026

విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

image

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్‌లో 2 ఏళ్లు క్యాంపస్‌లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.