News October 25, 2025
వనపర్తి: ప్రజావాణి ప్లేస్ తాత్కాలికంగా మార్పు

వనపర్తి జిల్లాలో ఈనెల 27న నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం వచ్చే సోమవారం సాధారణంగా జరిగే కలెక్టరేట్ మీటింగ్ హాల్ (IDOC) లో కాకుండా, RDO కార్యాలయం సమావేశ మందిరం (రూమ్ 3) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 27న ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం ఉండటంతో ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పు చేశామన్నారు.
Similar News
News October 25, 2025
శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.
News October 25, 2025
ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>
News October 25, 2025
అవంతిపురంలో రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో జరుగుతున్న ధాన్యం ప్రాసెసింగ్ విధానాన్ని, బాయిల్డ్ రైసు తయారీని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని మిల్లు యజమానికి కలెక్టర్ సూచించారు.


