News January 23, 2026

వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు: కలెక్టర్

image

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో దానిని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం (జనవరి 25) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 13, 2026

ANU: బీ ఆర్కిటెక్చర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్‌లో జరిగిన బీ ఆర్కిటెక్చర్ పరీక్షల ఫలితాలను పరీక్ష నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 2/5 ఒకటో సెమిస్టర్లో 62.50 శాతం, రెండవ సెమిస్టర్‌లో నూరు శాతం ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్, తదితర పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.

News April 13, 2026

నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.

News April 13, 2026

ఆసిఫాబాద్‌లో 1,689 ఇండ్ల బ్లాక్‌లు గుర్తింపు

image

జనాభా లెక్కలలో భాగంగా మే11 నుంచి ప్రారంభమయ్యే ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర జనాభా గణన సంచాలకులు భారతి హోలికేరి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇండ్ల జాబితా బ్లాక్‌లు, ఎన్యుమరేటర్లు, నియామకం, శిక్షణలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ASFలో 1,689 బ్లాక్‌లు, 994 ఎన్యుమరేటర్లు, 174 సూపర్వైజర్లు విధుల్లో ఉంటారని కలెక్టర్ హరిత తెలిపారు.