News April 17, 2025
వనపర్తి: ప్రతికూలీకి 6 రోజులు కూలి ఇవ్వాలి: అబ్రహం

వనపర్తి జిల్లాలో ఉపాధి హామీ కూలీలు వారంలో 6 రోజులు పనిచేస్తే 4 రోజులు మాత్రమే కూలి ఇస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అబ్రహం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 4 రోజులకు కూడా కేంద్రం నిర్ణయించిన రోజుకూలీ రూ.307 కాకుండా, రోజుకు రూ.300లే ఇస్తున్నారన్నారు. తీవ్రమైన ఎండలకు భూమి గట్టిపడి తెరగటం లేదని, ప్రతిరోజూ కనీసం రూ.600 కూలీ ఇవ్వాలన్నారు. లేదంటే కూలీలను కూడ గట్టి ఆందోళన చేస్తామన్నారు.
Similar News
News April 19, 2025
నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News April 19, 2025
ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.