News March 22, 2025

వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

image

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

Similar News

News December 26, 2025

కాకినాడలో బోటు ర్యాలీ.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు!

image

వచ్చే ఏడాది జనవరిలో పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు, కాకినాడ జగన్నాధపురం వద్ద ఘనంగా బోటు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పర్యాటక శాఖ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల బాధ్యతను టూరిజం శాఖ తీసుకోవాలని సూచించారు. త్వరలోనే ఈ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.

News December 26, 2025

పెద్దపల్లిలో కార్మిక – రైతు సంఘాల నిరసన

image

కేంద్రంలోని BJP ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ PDPLలో కార్మిక-రైతు సంఘాల ఆధ్వర్యంలో ITI గ్రౌండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్తు సవరణ బిల్లు, లేబర్ కోడ్స్, ఉపాధి హామీ చట్టంతో ప్రజలు నష్టపోతున్నారని నేతలు విమర్శించారు. విధానాలు మార్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

News December 26, 2025

గ్రేటర్ నయా రూపం ఇదే!

image

GHMC తాజా అధికారిక మ్యాప్ చూస్తుంటే సీన్ అర్థమవుతోంది. పాత వార్డుల లెక్కలకు చెల్లుచీటి రాస్తూ సరిహద్దుల పునర్విభజనతో సిటీ మ్యాప్ కొత్తగా మెరుస్తోంది. జనాభా పెరిగిన చోట వార్డులను ముక్కలు చేసి, పరిపాలన గల్లీ స్థాయికి చేరేలా స్కెచ్ వేశారు. శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్, కుత్బుల్లాపూర్ నుంచి రాజేంద్రనగర్ వరకు పెరిగిన కాలనీలన్నీ ఇప్పుడు సరికొత్త సర్కిళ్లలోకి చేరాయి. మ్యాప్‌లో జోన్‌ల సరిహద్దులు మారాయి.